News
దత్తాత్రేయతో కేసీఆర్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం కేసీఆర్ నివాసానికి దత్తన్న వెళ్లి 10నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, రాష్ట్ర ఆదాయ పరిస్థితు లు, ప్రజల కష్టాలు చర్చకొచ్చినట్లు సమాచారం. ప్రజల కష్టాలను దత్తన్న కు సీఎం తెలిపారు. రాషా్ట్రనికి రావాల్సి న పెండింగ్ నిధులు విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా తన కుమార్తె వివాహంకోసం ఎంతగానో కష్టపడ్డానని దత్తాత్రేయ అన్నారు. నోట్లరద్దు నేపథ్యంలో పార్లమెంటును అడ్డుకుంటున్న ప్రతిపక్షాల తీరును ఆయన తప్పుబట్టారు. ఢిల్లీలో తన కార్యాలయంలో దత్తన్న విలేకరులతో మాట్లాడారు. నోట్లరద్దుపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని, అయితే ప్రతిపక్షాలు పార్లమెంటును అడ్డుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఇది దుర్మార్గమైన చర్య అని, రాహుల్ గాంధీ అవగాహ న రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశహితం కోసమే నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








